జీవించాలి చిరంజీవిగా...
క్షణక్షణం
ప్రతిక్షణం
నిద్రలో సైతం
నిఘా పెట్టి వుంచాలి
ముంచుకు వచ్చే
మొండి రోగాల్ని,
ముఖ్యంగా
గుట్టుచప్పుడు కాకుండా
వచ్చే గుండెజబ్బుల్ని
ఖర్చు పెడుతూ వుండాలి
కొంచెం కొంచెం
కాస్త తెలివితో
కాసింత ధైర్యంతో
కష్టపడి చెమటోడ్చి
ఆర్జించిన ఆస్తిపాస్తుల్ని
అనుభగ్నుల్ని
అడిగి తెలుసుకోవాలి
అన్వేషిస్తూ వుండాలి
ఆదాయాన్ని
ఆరోగ్యాన్ని
ఆయుస్సును పెంచే
మంచి మార్గాల్ని
పారాయణ చేయాలి ప్రతినిత్యం
బైబిల్, భగవద్గీత భారత
భాగవత రామాయణాది
ఆథ్యాత్మిక గ్రంథాల్ని
గడపాలి కాలం పరులసేవలో
తీర్చాలి అనాధల ఆకలిని
ఆకాంక్షించాలి అందరి క్షేమాన్ని
అనునిత్యం ఆ పరమాత్మను
ప్రార్థించాలి అర్థించాలి ఆశతో
బ్రతకాలి భయంతో భక్తితో
అస్తమించాలి మంచి ఆరోగ్యంతో
ఆనందంతో తృప్తితో ఆత్మతృప్తితో
చిరంజీవిగా మిగలాలి చరిత్రపుటల్లో



