మీ వివాహము
ఎంతో ఘనమైనది
ఎంతో విలువైనది
ఎంతో పవిత్రమైనది
మీరు చేసే ప్రతి ఆలోచన
పవిత్రమైనదైతే
మీ వివాహం పరిపూర్ణమైనదే
మీ వివాహం
అద్భుతమైనది
ఆశ్చర్యకరమైనది
అమోఘమైనది
మీరు చూసే ప్రతి చూపు
పవిత్రమైనదైతే
మీ వివాహం ఆనందదాయకమైనదే
మీ వివాహం
సుందరమైనది
సుమధురమైనది
శుభకరమైనది
మీరు మాట్లాడే ప్రతి మాట
పవిత్రమైనదైతే
మీ వివాహం సుఖవంతమైనదే
మీ వివాహం
ప్రశాంతమైనది
ప్రకాశవంతమైనది
ఫలభరితమైనది
మీరు వేసే ప్రతి అడుగు
తీసుకునే ప్రతి నిర్ణయం
పవిత్రమైనదైతే
మీ వివాహం నవరసభరితమైనదే
వివాహం ఒక విధి నిర్ణయం
వివాహం ఒక మూడు ముళ్లబంధం
వివాహం ఒక ప్రకృతి ధర్మం
వివాహం ఇద్దరు చేసే ఓ చీకటియుద్ధం
వివాహం ఒక విహార యాత్ర
వివాహం ఒక అంతులేని ప్రవాహం
వివాహం ఒక విచిత్రమైన ప్రయాణం
వివాహం ఒక విందు భోజనం
భయపడకు బాధపడకు
భగవంతున్ని నిందించకు...
నీవేదో కోల్పోతున్నావని కుమిలిపోకు
నీవేదో చిక్కుల్లో చిక్కుకున్నానని కృంగిపోకు
నీ చుట్టూ చీకటి కమ్ముకున్నదని చింతించకు
నీవు దైవానికి దూరమౌతున్నావని దుఃఖించకు
ఆకులు రాలిన చెట్టే మళ్ళీ చిగురిస్తుంది
కడుపు పండినతల్లే బిడ్డకు జన్మనిస్తుంది
కారుమేఘాలు కరిగి చిమ్మచికట్లు తొలిగి
తూర్పున సూర్యుడు తప్పక ఉదయిస్తాడు
నారుపోసినవాడు తప్పక నీరు పోస్తాడు
నీకు జన్మనిచ్చిన దేవుడు నిన్నాదుకుంటాడు
భయపడకు బాధపడకు భగవంతున్ని నిందించకు
రానిలేని చిన్నచిన్న సమస్యలకే అతిగా స్పందించకు
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే
నీ విశ్వాసమే నీ ఊపిరిగా నీవు జీవిస్తే
అనునిత్యం భక్తితో ఆ భగవంతుని ధ్యానిస్తే
ప్రతిదినం ప్రతిక్షణం ఆ పరమాత్మనే స్మరిస్తే
రాళ్ళు రత్నాలైనట్లు శిలలు శిల్పాలైనట్లు
నీ కష్టాలు కన్నీళ్లు రేపు చెరగని చిరునవ్వులౌతాయి
నీ ఇంట సుఖం సంతోషాలు వెల్లివిరుస్తాయి
నీ పై కృపావరములు కుమ్మరించబడతాయి



