వందేళ్లు వర్థిల్లమని దీవిస్తాడు?
ఓ ప్రియ మిత్రులారా
మీ అందరికి ఒక చిన్న విన్నపం
కీడుచేయుట మానుకొనుడి
మేలుచేయుట నేర్చుకొనుడి
న్యాయము జాగ్రత్తగా విచారించుడి
హింసించబడు వారిని విడిపించుడి
అన్యాయాన్ని ఎదిరించే వారికి
అన్ని వేళలా అండగా వుండుడి
అనాధల ఆకలితీర్చి ఆదరించుడి
నిరుపేదలకు నిలువ నీడనివ్వుడి
తండ్రిలేనివారికి న్యాయము తీర్చుడి
విధవరాళ్ళ పక్షముగా వాదించుడి
మీ పరలోకపు తండ్రి మీ పై
వరాల వర్షం కురిపిస్తాడు
మిమ్మల్ని వందేళ్లు వర్థిల్లమని దీవిస్తాడు
ఇంతకంటే మీ కింకేమి కావాలి చెప్పండి



