అడుగు అడుగు
అడుగు అడుగు అడుగు
అడుగుతూనే ఉండు
నీవు అడిగింది నీవు తప్పక పొందుతావు
నీవుపొందింది నీవు అనుభవిస్తావు
ఆనందిస్తావు
వెదుకు వెదుకు వెదుకు
వెదుకుతూనే వుండు
నీవు వెదికే ఆ నిధి నీదే
నీకే దొరుకుతుంది అది నీకే దక్కుతుంది
తట్టు తట్టు తట్టు
తడుతూనేవుండు
తట్టిన ప్రతితలుపు తెరువబడుతుంది
ఆ గదిలో బంగారు గనులుండవచ్చు
నీ బ్రతుకు బంగారుమయం కావచ్చు
భయపడకు ఆభగవంతుణ్ణి
నిస్సందేహంగా నిర్మొహమాటంగా ,
ఇష్టపూర్వకంగా ప్రార్ధించు
ప్రభువు నీ మొర ఆలకిస్తాడు ఆపై
నీపై నిండుగా దీవెనలు కుమ్మరిస్తాడు



