బండి మరియ కుమార్
ఆహా ఎంత అద్భుతమైన పేరు
బ్రదర్ సాహిత్యంలో మీకు
ఎవరూ సాటిరారు లేరు
మూడు భాషల్లో వ్యాసాలు
వ్రాయడం ఎందరికి సాధ్యం?
ఆ తల్లి మరియచే
కొడుకు క్రీస్తుచే
దీవించబడిన
దివ్యమైన నామం మీది
ఆపేరులో ఎన్ని
అక్షరాలున్నాయే
అన్ని వరాలు మీకు
అందినట్లే లెక్క
అసలు ఆపేరే ఒక వరం
ఆపేరులో వెలుగువుంది
ఆపేరులో అనంత శక్తి వుంది
ఆపేరులో గుప్తజ్ఞాననిధులున్నాయి
త్రవ్వి తీసి పదిమందికి
పంచడమే ఇక మిగిలింది
ఆపేరు కింద వేర్లు లక్షలు
కులతుఫాన్లు ఎన్ని వచ్చినా
మరియు కుమార్ ఒక మర్రివృక్షం
అది చెక్కుచెదరదు, పైగా
విశ్వమంతా విస్తరిస్తూనే వుంటుంది
లక్షల అజ్ఞానపు పక్షులకు
నిరంతరం విజ్ఞానపు నీడను
ఇస్తూనే వుంటుంది,
ఆ పేరు అందుకే పుట్టింది
దళితవాడలో అడుగు పెట్టింది
కలం పట్టింది దైవం భుజం తట్టింది
ఇక ఎదురేముంది ?
దాని ప్రయాణాన్ని ఆపేదెవరు ?
అది వింత కాదు ఒక విచిత్రం
అది పత్రికా ప్రపంచంలో ఒక దివ్యనక్షత్రం



