Facebook Twitter
శ్రీ గిడుగు పంతులు

తెలుగు భాషకు
ఆభరణం

తెలుగు తల్లికి
మంగళ తోరణం

తెలుగు కవులకు
ఆశాకిరణం

తెలుగు భాషకు
వెలుగు కిరణం

తెలుగు జాతికెంతో
గర్వకారణం

తెలుగురత్న
తెలుగుజాతి జ్యోతి

రెండుతరాల
కళాకారులకు వారధి

మన తెలుగుభాషకు
ప్రచారరథసారథి

మన తెలుగుభాష
ఉద్యమానికి ఊపిరి

చిరంజీవి
చిరస్మరణీయులు
శ్రీ గిడుగు పంతులు
గారికిదే నా అక్షరనీరాజనం...