Facebook Twitter
గతంలో...

లక్ష సార్లు సుత్తిదెబ్బల్ని
కోటి టన్నుల ఒత్తిడిని
ఒక్కడే ఒంటరిగా భరించి
వేలమంది బెదిరించే శతృవుల్ని
ఎదిరించి పోరాడి గెలిచిన
కొత్త కాఫీ సామ్రాజ్యాన్ని స్థాపించి
జరిగిన తప్పులకు చేసిన అప్పులకు
తననొక్కడినే బాధ్యున్ని చేసుకుని
గుండెల్లో అగ్నిపర్వతాలను దాచుకొన్న
అమృతామూర్తి మానవతావాది
కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్ సిద్దార్థ

ఊరించే విధంగా
మతిపోయేలా మత్తెక్కించేలా
వేలకొద్దీ కొత్త కేఫ్ కాఫీడేలను స్థాపించి
అభాగ్యులకెందరికో జీవనోపాధి కల్పించి
ఊహలకందని రీతిలో
ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిన
ప్రపంచప్రసిద్ధి చెందిన బిజినెస్ మాగ్నెట్
కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్ సిద్దార్థ

వేల కేఫ్ కాఫీ డేలను‌
చూడగానే ఆకట్టుకునేలా
తిలకించగానే పులకించిపోయేలా
అడుగు పెట్టగానె ఆశ్చర్యచకితులయ్యేలా
కాఫీ త్రాగగానే తన్మయత్వం చెందేలా
అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో
ఒత్తిడికి గురయ్యే ప్రతిఒక్కరిలో
కొండంత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపిన
కోటీశ్వరుడు కరుణామయుడు
కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్ సిద్దార్థ
నేత్రావతీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే
ముందు ఒక్కక్షణం ఆలోచిస్తే ఎంత బావుండేది ?
చచ్చి తాను సాధించేదేమిటని ?
తనలా ఆవేశంతో ఆత్మహత్య చేసుకునే
యువతకు తానిచ్చే సందేశమేమిటని ?

సమస్యల ఇనుపసంకెళ్ళలో బంధింపబడినా
ఎన్ని అవాంతరాలు వచ్చినా అడ్డంకులు ఎదురైనా భయపడక జీవితంలో పోరాడి గెలిచినవారే వీరులు
పారిపోయిన వారంతా పిరికిపందలే చరిత్రహీనులే