ఔరా!
కోట్లమంది అభ్యర్థనలను
ఎందుకు అంగీకారంచలేదో
దయామయుడైన ఆ దైవము
కన్నకొడుకు చరణ్ కన్నతండ్రిని
కంటికిరెప్పలా చూసుకున్నాడు
బ్రతికించుకోవడానికి
వేయి మార్గాలు వెతికాడు ఐనా
"అమరుడైపోయాడు"మనబాలు
16 భాషల్లో మధురాతి మధురంగా
40 వేల పాటలు పాడి
కోట్ల మందిని పరవశించేసి
విన్నంతసేపు అలసటను
మరిచిపోయేలా మధురంగా
గానం చేసి ఆలపించి అందరి
అలసటను తీర్చి ఎందరికో
ఆనందామృతాన్ని పంచిన
"గాన గంధర్వుడు" మనబాలు
ఎందరో ఔత్సాహిక గాయనీ
గాయకులకు చేయినందించి
చేయూతనిచ్చి, ప్రోత్సాహామిచ్చి
వెలుగులోనికి తెచ్చి
కొత్త జీవితాలనిచ్చి
ఎందరో బాలసుబ్రహ్మణ్యాలను
తయారు చేసిన మంచి మనసున్న
"మకుటం లేని మహారాజు"మనబాలు
అందరి నాలుకలమీద
నడయాడుతూ
ఆబాలగోపాలాన్ని అలరించి
శ్రోతలనెందరినో తన గానమాధుర్యంలో
ఓలలాడించి,వారి గుండెగుడిలో
దైవమైనిలిచి పోయిన
ఓ గానగంధర్వా !
లేదు మీకు మరణం
ప్రతిపాటలో మీప్రాణం
సజీవమైవుంటుంది
ప్రతిశ్రోత గుండెగుడిలో
మీ నిజస్వరూపం నిండివుంటుంది
కులకవచ్చు కరోనా మిమ్ము కాటేశానని
కాని తెలియదు దానికి మీకు మరణమేలేదని...



