Facebook Twitter
నడిచే ఓ విశ్వవిద్యాలయమా!

ఏవేడుకకైనా ఏ వేదికైనా ఏ సంగీతసభకైనా
మీరే ఓ నిండుదనం మీరే ఒక "అట్రాక్షన్"
పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో ఎన్నో చక్కని
మధురమైన పాటలను జనరంజకంగా పాడి

ఆబాలగోపాలాన్ని అలరించిన ఓ"గానగంధర్వా!

ప్రతివేడుకలో నిజజీవిత నిత్యసత్యాలను
అందించిన కాషాయ వస్త్రాలు ధరించని
ఓ "ఆధ్యాత్మిక గురువా!

ఎందరో ఔత్సాహిక గాయనీగాయకులను
చలన చిత్రసీమకు పరిచయం చేసిన
ఓ "ప్రేమమూర్తి ! ఓ అందరి "దైవమా!

"శంకరాభరణం"చిత్రంలోని పాటకు
జాతీయ పురస్కారాన్ని పొందిన
ఓ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతా!

ఖరీదైన మీ ఇంటిని కంచిమఠానికి
విరాళంగా ఇచ్చిన ఓ దాతా"! స్పూర్తి ప్రదాతా!
ఓ"ఉదారస్వభావీ !"ఓ నిగర్వి! "ఓనిర్మలమూర్తి!

1946 సంవత్సరంలో నెల్లూరులో జన్మించి
75 సంవత్సరాల మీ జీవితాన్ని
సంగీతసాధనకే చిత్రసీమకే అంకితం చేసి
అమరగాయకుడు ఘంటసాలనే మరిపించి
కొన్ని దశాబ్దాలు దక్షిణభారత చలనచిత్ర
సంగీత సామ్రాజ్యాన్ని ఏకధాటిగా ఏలిన
ఓ "మకుటంలేని మహారాజా!

48 రోజులు కరోనాతో పోరాడి పోరాడి
ఓడిపోయి అమరుడవైపోయావా!
ఓ గానగంధర్వా మాకోసం మళ్ళీ పుట్టవా ...