పీవీ గారంటే...తెలుగదనం ఉట్టిపడే...గొప్పఠీవీ
ఆ నాడు ఆంధ్ర రాష్ట్రమంత్రిగా ముఖ్యమంత్రిగా
కేంద్రమంత్రిగా ప్రధానమంత్రిగా పదవులకు వన్నెతెచ్చి
మన పీవీ చేసిన సేవలు తీసుకున్న సాహసోపేతమైన
నిర్ణయాలతో భారతదేశ ముఖచిత్రమే మారింది
ఆకాశవీధిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది
గురుకుల నవోదయ పాఠశాలలకు శ్రీకారం చుట్టి
నేడెవరూ ఊహించని కమ్మని ఫలాలనందిస్తున్న
జైలు విద్యా వైద్య విదేశాంగ ఆర్థిక భూసంస్కరణల
వటవృక్షాలకు నాడు విత్తనాలను చల్లిన ఘనుడు
త్యాగధనుడు సంస్కరణల పితామహుడు మన పీవీ
భూసంస్కరణల చట్టం చేసి తన 800 ఎకరాలను
పేదలసంక్షేమాని కిచ్చిన గొప్పత్యాగి యోగి మన పీవీ
నాడు అంతర్గత విభేదాలతో ఆరిపోయేదీపంలా
మునిగిపోయేపడవలాంటి మైనారిటీ ప్రభుత్వాన్ని
సుడిగుండాలకు చిక్కకుండా నడిపి తీరం చేర్చిన
మాంత్రికుడు తాంత్రికుడు ఇంధ్రజాలికుడు మన పీవీ
నాడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తల్లడిల్లే
ఢిల్లీని ఒక తల్లిలా లాలించి ఆర్థికసంస్కరణలపాలిచ్చి
ఒడిలో చేర్చుకొని ఓదార్చిన జాతినేత స్పూర్తి ప్రదాత
భాగ్యవిధాత భరతమాత ముద్దుబిడ్డడు మన పీవీ
విదేశాంగ విధానంలో విప్లవాత్మకమైనమార్పులు తెచ్చి
ప్రక్కలో బల్లేలైన శతృదేశాలకు స్నేహహస్తం అందించి
మిత్రదేశాలుగా మార్చిన అపరచాణుక్యుడు మన పీవీ
14 భాషలమీదపట్టుతో ఇన్ సైడర్ ఆత్మకథను వ్రాసి
వేయిపడగలను హిందీలోనికి అనువదించి కేంద్ర
సాహిత్య అకాడమీ పురస్కారాన్ని.......అందుకున్న
సాహితీ శిఖరం...తెలుగు వెలుగుకిరణం మన పీవీ
మచ్చలేని చంద్రుడు మాలిన్యమంటని మహాత్ముడు
అవినీతి ఆరోపణలులేని అరుదైన ప్రజానాయకుడు
విజ్ఞుడు స్థితప్రజ్ఞుడు మౌనముని విజ్ఞానగని మన పీవీ
ఆమేధావికి ఆదర్శమూర్తికి ఇవేనా శతకోటి వందనాలు



