విశిష్టమైన పదసృష్టి చేసి
సాహితీ ప్రపంచంలో
సంచలనం సృష్టించిన
మహాకావ్యం శ్రీ శ్రీ మహాప్రస్థానం
కానీ అలతిఅలతి పదాలతో
చలన చిత్రసీమలో
మరిచిపోలేని మధురమైన
సినీ గీతాలెన్నో
రచించిన...మహాకవి మన...శ్రీ శ్రీ
మచ్చుకకు కొన్ని...
"తెలుగువీర లేవరా !
దీక్షబూని సాగరా !
దేశమాత స్వేచ్ఛ కోరి
తిరుగుబాటు చేయరా !
అదరవద్దు... బెదరవద్దు...
నింగి నీకు హద్దురా...అంటూ
విప్లవంశంఖాన్ని
పూరించిన "విప్లవకవి"...శ్రీ శ్రీ
"స్వాతంత్రం వచ్చెనని సభలేచేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తినిచెంది
అదే విజయమనుకుంటే
పొరపాటోయి"...అంటూ దేశభక్తిని
చాటిన"గాంధేయవాది"...శ్రీ శ్రీ
"ఉందిలే మంచి కాలం
ముందు ముందునా అందరూ
సుఖపడాలి నందనందనా
సందేహంమెందుకో నీవంతు అందుకో
ఆరోజు నీ ముందే ఉందట
నీవే రాజువట అన్న"...
గొప్ప"ఆశావావాది"...శ్రీ శ్రీ
"అగాధమౌ జలనిధిలోన
ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంతటతానై నీదరికి రాదు
శోధించి సాధించాలి అదియే
ధీరగుణం"అన్న"తత్త్వవేత్త"...శ్రీ శ్రీ
ఆంధ్రజాతికి మహాకవి శ్రీ శ్రీ ఒక ఆణిముత్యం !
కలంపట్టిన ప్రతికవికి ఆయనొక ఆరాధ్యదైవం!
మరణంలేని ఆ మహాకవికిదే నా అక్షరనీరాజనం!



