Facebook Twitter
శ్రీ శ్రీ కలం... ‌కవిత్వం

శ్రీ శ్రీ తన కలాన్ని
ఒక కత్తిలా...
ఒక త్రిశూలంలా..
ఒక ఆయుధంలా...
ఒక ఆటం బాంబులా...

శ్రీ శ్రీ తన కవిత్వాన్ని
ఒక ఔషధంలా...
ఒక ఆక్సిజన్ లా...
ఒక అమృతంలా...
ప్రయోగించిన ప్రజ్ఞాశాలి...

శ్రీ శ్రీ ఒక అక్షర జ్యోతి...
ఆరక రగిలే ఒక అగ్నిజ్వాల...
సాటిలేని పోటీలేని సాహితీశిఖరం...

శ్రీ శ్రీ కిఅక్షరాలే ఆయుధాలు...
వారు విరచించిన మహాప్రస్థానం....
సాహితీలోకంలో ఒక మైలురాయి...

శ్రీ శ్రీ శత్రువుల పాలిట సింహస్వప్నం...
కులమతాల హద్దులుచెరిపిన యుద్ధవీరుడు...
సమతామమతల సామ్రాజ్యానికి
మకుటంలేని మహారాజు మరణంలేని మహాకవిశ్రీశ్రీ
ఆ అమరజీవికిదే నా అక్షర నీరాజనం...