Facebook Twitter
రెండు అక్షరాల శ్రీ శ్రీ

శ్రీరంగం శ్రీనివాసరావు
అంటే ‌తొమ్మిది అక్షరాల
నవగ్రహాల శక్తిస్వరూపమే
శ్రీ శ్రీ అన్న అతిశక్తివంతమైన
రెండు బీజాక్షరాలుగా మారింది
ఆ రెండు బీజాక్షరాలే
ఆరని ఒక...అగ్ని...కి
రగిలే ఒక ...జ్వాల...కి
ప్రచండమైన ఒక...శక్తి...కి
విప్లవాత్మకమైన ఒక...మార్పు...కి
ప్రతిరూపాలయ్యాయి....
ప్రతిబింబాలయ్యాయి....

శ్రీశ్రీ అన్న ఆ‌రెండు మంత్రాక్షరాలను
జపించిన తలంచిన చాలు తక్షణమే
మనసులో విప్లవాత్మక భావాలు
విద్యుత్ తరంగాలై ఉద్భవిస్తాయి
పదాలు బాకులై దూసుకువస్తాయి
ఆలోచనలు తుపాకులై పేల్తాయి
మాటలు మందుపాత్రలౌతాయి
పిడికిళ్లు బిగుసుకుపోతాయి
గొంతులు సింహగర్జన చేస్తాయి
కవితలు కత్తులై కదంతొక్కుతాయి
అక్షరాలు ఆరని ఆగ్గిరవ్వలౌతాయి
ఊహలు ఉప్పెనలై విరుచుకుపడతాయి
కవుల కలాలు ఎర్రజెండాలై ఎగురుతాయి

ఇంక్విలిబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి
అంటూ నినాదాలు నింగినంటుతాయి
అందుకే ఆ మహాకవిని ప్రతినిత్యం
మదిలో యస్మరించుకొని స్పూర్తినిపొందాలి
అదిగో మరోప్రపంచం పిలుస్తుందన్న
ఆశతో అందరూ తృప్తిగా జీవించాలి
ఆ మహకవి కవులందరికీ అనునిత్యం
దర్శనమిచ్చే అరుణోదయకిరణం
లేదు లేదు మహాకవికి లేదు మరణం.......
ఆ అమరజీవికిదే నా అక్షరనీరాజనం........