Facebook Twitter
ప్రధాన న్యాయమూర్తిగా – తెలుగుబిడ్డ

48 వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
38 ఏండ్ల అపారమైన న్యాయపరిజ్ఞానంతో
అత్యున్నత భారత న్యాయపీఠాన్ని అధిరోహించ
63 సంవత్సరాల వయసులో ఢిల్లీ అశోకాహాలులో
"నూతలపాటి వెంకట రమణ" అను నేను అంటూ
ప్రమాణంచేయగ "తెలుగుబిడ్డ"పులకించె "తెలుగుగడ్డ"

మొన్న కాలేజీ విద్యార్థిగా అన్యాయాన్ని ప్రశ్నించి
శాంతియుతంగానే ‌అనేక న్యాయ పోరాటాలు చేసి
సామరస్యంగానే జటిల సమస్యలను పరిష్కరించి
శాంతి సహనం అహింసతో ఏదైనా సాధించవచ్చని
యుద్ధమే చేయనక్కరలేదన్న బుద్దుని సిద్దాంతంతో
ఆర్జించగ "అఖండఖ్యాతి" గర్విస్తోంది "తెలుగుజాతి"

అతిసాధారణమైన ఒక బడుగురైతు కుటుంబంలో
"పొన్నవరం" గ్రామంలో పచ్చని పచ్చి పల్లెటూరిలో
"గణపతిరావు సరోజినీదేవీల"కు పుణ్యఫలంగా పుట్టి
"తాతయ్య బాపయ్య చౌదరి" దానగుణాలతో పెరిగి
"కంచికచర్ల" లో గుడ్డిదీపం వెలుగులో కష్టపడి చదివి
గుంటూరు"నాగార్జున విశ్వవిద్యాలయాన"లాపట్టా చేపట్టి
ధర్మబద్ధంగా న్యాయమూర్తిగా రాజ్యాంగస్ఫూర్తితో ఎన్నో
సంచలన "తీర్పులిచ్చినవేళ" పులకించిపోయె"తెలుగునేల"

ఓ విజ్ఞానమా శిఖరమా ! ఓ నూతలపాటి వంశాంకురమా !
ఏదీ కోరని ఆశించని ప్రశ్నించని "శివమాలకు" ధర్మపత్నిగా
"భువన తనూజలకు" కన్నతండ్రిగా"న్యాయ పరిరక్షకుడిగా"
ఏడుకొండల వెంకన్న ఆశిస్సులతో16 నెలలే పదవిలోఉన్నా
రాజ్యాంగస్ఫూర్తితో న్యాయదేవత సాక్షిగా సంచలనాత్మక
తీర్పులతో దద్దరిల్లిపోవాలి అత్యున్నత న్యాయపీఠం"
నేర్పాలి అవినీతినేతలకు గుర్తుండే "గొప్పగుణపాఠం"