Facebook Twitter
సంపాదక శిఖామణి ...సి.వై చింతామణి

తెలుగుభాషను గౌరవించని ప్రజలమధ్య
తెలుగువాడిని చిన్నచూపు చేసే వ్యక్తులమధ్య
జీవిస్తూ ఆంగ్లబాషలో పట్టును సాధించి
ఎన్నో ఇంగ్లీష్ పత్రికలకు "సంపాదకత్వం" నిర్వహించి
పత్రికారంగంలో "మకుటంలేని మహారాజుగా"
ఓ వెలుగు వెలిగిన ఓ తెలుగు తేజమా!
ఓ విజయనగరం వీరుడా ! మీకు వందనం అభివందనం!

పత్రికలపై మమకారంతో
విజయనగరం నుండి మద్రాసుకు మకాం మార్చి
ది ఇండియన్ పీపుల్, ది లీడర్, ది మద్రాస్ స్టాండర్డ్
పత్రికల్ని ప్రతిభావంతంగా నిర్వహించి
"హిందూ" పత్రికాయాజమాన్యంతో
"ఉపన్యాస కేసరిగా"  ప్రశంసలందుకున్న
ఓ ఆంగ్లపండితుడా ! పత్రికా సంపాదకుడిగా
ఓ వెలుగు వెలిగిన ఓ తెలుగు తేజమా !
ఓ విజ్ఞానగనీ ! మీకు వందనం అభివందనం !

పాల్గొన్న ప్రతిసభల్లో ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించి 

సభికులను ఉర్రూతలూగించిన ఓ ఉపన్యాసకేసరీ !
రాజకీయరంగాన ప్రవేశించి శాసనమండలి సభ్యుడిగా
మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని
ఆంగ్లేయులచే "సర్" బిరుదును పొందిన 
ఓ రాజకీయ దురంధరుడా !
హిందూ బెనారస్ విశ్వవిద్యాలయాల్లో
ఓ వెలుగు వెలిగిన ఓ తెలుగు బిడ్డా!
మీకు వందనం ! అభివందనం !

ఎక్కడో విజయనగరంలో పుట్టి ప్రపంచమంతా
విజ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ఓ విజ్ఞానదీపమా!
"పోప్ ఆఫ్ ది ఇండియన్" గా ఖండాంతర ఖ్యాతి నార్జించిన
ఓ ఆంధ్రజాతి ఆణిముత్యమా! ఓ ఆరనిదీపమా !
మీకు వందనం అభివందనం!

ఓ సంపాదక శిఖామణీ !
ఓ చిర్రావూరి వంశాంకురమా !
ఓ యజ్ఞేశ్వర చింతామణి దీపమా !
మీరు చిరంజీవులు! చిరస్మరణీయులు!
మీ స్మరణే అందరికీ ఓ ప్రేరణ! మీకిదే మా అక్షరాంజలి!