Facebook Twitter
మళ్ళీ రావా! ఓ గానగంధర్వా !

ఓ గాన గంధర్వా !
మిమ్ము మరువలేము
మీ సుమధురమైన గాత్రాన్ని
మీ అమృతగానాన్ని మరువలేము...
మిమ్ము మాకు దూరం చేసిన
కరుణా జాలి దయలేని
ఆ కరోన రక్కసిని మరువలేము...

ఓ గాన గంధర్వా !
మీరు ప్రాణం పోయని పాటెక్కడిది...?
మీరు గానం చేయని వేదికెక్కడిది...?
మీరు చిరునవ్వుతో దర్నమివ్వని
శుభసందేశమివ్వని టీవీ చానలెక్కడిది...?

ఓ గాన గంధర్వా !
ప్రతినిత్యం గుడిగోపురాల్లో
సుప్రభాతాల్లో మీరు వినిపిస్తూనే వుంటారు
ప్రతిరోజూ టీవీ చానల్లో
మీరు మాకు కనిపిస్తూనే ఉంటారు
నిత్యం చెరగని చిరునవ్వుతో
మీరు మాకు దర్శనమిస్తూ నేవుంటారు

ఓ గాన గంధర్వా !
స్వర్గంలో స్వరాభిషేకమని...
కనిపించని ఆదైవం
మీకు కనకాభిషేకం చేస్తాడని...
కనుమూశావా! కనుమరుగైపోయావా!
ఐనాపోయి రావయ్యా !
ఓ గానగంధర్వా ! ఆ పరమాత్మ సన్నిధికి!

కానీ మళ్ళీ రావా ! ఓ స్వరమాంత్రికుడా !‌
మరణానంతరం మీకు దక్కిన"పద్మవిభూషణ్"

పురస్కారాన్ని అందుకోవడానికి !
అమరగాయకుడు యస్.పి.బాలుగారికి...
అశృనయనాలతో......ఇదే నా అక్షర నీరాజనం...