ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?
మతోన్మాదులైన మైతీలు ఇంటర్నెట్
బంద్ చేసి ప్రభుత్వ పోలీస్ పారామిలిటరీ
బలగాల అండతో...మూడు నెలలుగా
విచ్చలవిడిగా...మారణాయుధాలతో
సాగించిన మారణకాండకు రావణకాష్టంలా
రగిలే "మణిపూర్ మంటల్లో "...నేనక్కడ..!
ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?
కుకీ మహిళలిద్దరిని వివస్త్రలను చేసి
"నడిరోడ్లో నగ్నంగా" ఉన్మాదులై ఊరేగించి
రాక్షసానందం పొందిన మైతీ "ఉగ్రవాద యువకుల"ఉక్కుపాదాల క్రింద" నేనక్కడ..!
ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?
పోయినహక్కులకై ప్రశ్నించే ప్రతిఘటించే...
ఎదిరించే...పోరాడే...నిస్సహాయులైన
బడుగు...బలహీన...బహుజన...గిరిజన
దళిత యువతపై..."మూత్రవిసర్జన చేసే
మూర్ఖులమస్తిస్కాలల్లో... నేనక్కడ..
ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?
ఆర్జించిన ఆస్తులన్నీ...ప్రేమతో పంచి
అనాధలైపోయి...ఆకలికి అలమటిస్తు
అస్థిపంజరాలైన...అమ్మానాన్నలను
నిర్ధాక్షిణ్యంగా ఆనాధాశ్రమాల్లో చేర్పించే
"కుక్కలకన్నా హీనులు కసాయిలైన
కన్నబిడ్డల"రాతిగుండెల్లో "...నేనక్కడ..!
ఓ మానవత్వమా..! నీ వెక్కడ..?
ఉన్మాదుల..."ఉరి కంభంపై" నేనక్కడ
కామాంధుల..."కబంధ హస్తాల్లో" నేనిక్కడ
తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు
"బలిపశువులై వ్రేలాడే బలిపీఠంపై" నేనక్కడa



