మనది కానిది మనకు
దక్కాలనుకోవడం ధర్మమా ?
మనకు దూరమైనది మనకు
చిక్కాలనుకోవడం న్యాయమా?
అర్హత లేకుండా సింహాసనం
ఎక్కాలనుకోవడం భావ్యమా ?
కనిపించిన ప్రతి రాయిని
దైవమని మొక్కాలను కోవడం
ఎక్కడి భక్తి ? ఎక్కడి ధర్మం?