నీకు నాకేం తెలుసు
నిమ్మకాయ పులుసు?...
గాడిదకేం తెలుసు
గంధం విలువ...
గాఢాంధకారంలో తిరిగే
గబ్బిలానికేం తెలుసు
వెలుగు విలువ...
ఆటలో ఓడినవాడికేం
తెలుసు విజయం విలువ...
గుడ్డివాడికేం తెలుసు
గులాబీ విలువ...
మందబుద్దికేం తెలుసు
మహాభారతం విలువ...
పైనున్న పరమాత్మకే
తెలుసు ప్రాణం విలువ...
నీకు నాకేం తెలుసు
నిమ్మకాయ పులుసు...



