అనగనగా ఒక ఊరు ఉంది
ఆ ఊరిలో ఒక బడి ఉంది
ఆ బడిలో పిల్లలు ఉన్నారు
కానీ చదువు చెప్పేందుకు గురువేలేడు
ఆ పిల్లల భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకమైంది
అనగనగా ఒక ఊరు ఉంది
ఆ ఊరిలో ఒక గుడి ఉంది
ఆ గుడిలో ఒక ధైవముంది
కానీ పూజలు చేసేందుకు పూజారేలేడు
ఆ ఊరిప్రజలకు దైవదీవెనలు దక్కేదారేది?
అనగా అనగనగా ఒక ఊరు ఉంది
ఆ ఊరిలో ఒక బావి ఉంది
ఆ బావినిండా నీరు ఉంది
కానీ నీరు చేదుకోవటానికి ఒకబకెట్ లేదు
మరి ఆ ఊరి ప్రజలందరి దాహం తీరేదెలా?
చింటూ చాలా చురుకైన వాడు
ఇది తెలిసి బుర్ర గోక్కున్నాడు
జుట్టు పీక్కున్నాడు తళుక్కుమని ఆలోచన
ఒకటి చింటూ బుర్రలో మెరుపులా మెరిసింది
వెంటనే కేటీఆర్ అన్నయ్యకు
కెసిఆర్ తాతయ్యకు
ట్విట్టర్లో సందేశాలు పంపాడు
అధికారులకు ఆదేశాలందాయి
మరునాడు ఊరికి కార్ల వరద వచ్చింది
ఆఘమేఘాల మీద అన్నీజరిగిపోయాయి
ఊరికి ఊహించని ఒక కొత్త వెలుగు తెచ్చింది
చింటూ కొత్త ఆలోచనతో
ఊరి బడికి గురువొచ్చాడు
ఊరి గుడికి పూజారొచ్చాడు
ఊరబావికి ఒక బకెట్ వచ్చింది
చింటూ కొత్త ఆలోచనలతో
ఊరి జీవనమే మారిపోయింది
అందుకే మన గురువులంటారు
ఒక ఐడియా జీవితాన్నే మార్చేవేస్తుందని
అందుకే ఓ పిల్లల్లారా ! ఓ పిడుగుల్లారా !
కొత్తగా ఆలోచించండి! విజ్ఞానవంతులుకండి!
మిమ్మల్ని కన్న మీ అమ్మానాన్నలకు
మీరు పుట్టిన ఊరికి గట్టిపేరును తెచ్చిపెట్టండి!!



