Facebook Twitter
"కళ్ళులేని కప్ప" "పాలుత్రాగే పాము"

వేడి వేడి
"పాలు త్రాగే పామును"
పాపం "కళ్ళులేని కప్ప" వెళ్ళి
కన్నీటితో వేడుకుందట
ఒక "కప్పుపాలు" అప్పిమ్మని...

ఫక్కున నవ్విన పాము
అయ్యో ఒక "కప్పా"
పది కప్పులపాలు
"ఫ్రీగా"తీసుకోవే
"పిచ్చి కప్పా"అందట

అప్పుడు ఆ అమాయకపు
"కళ్ళు లేని కప్ప" ఆనందం పట్టలేక 
అది కలయో......నిజమో అర్థంకాక పరమానందంతో గంతులేస్తూవుంటే...

పాలన్నీ త్రాగేసిన పాము
ఇంకా "ఆకలితీరక" గంతులేసే
"కప్పను" గబుక్కున మింగేసిందట

ఔను ఇది ప్రతిమనిషి
గుర్తుంచుకో దగ్గ "కప్పగుణపాఠం"...

ఆకలేసిన పులికంట పడిన
ఏ "జింక" బ్రతికి బట్టకట్టలేదని...

పాలుత్రాగే "పాము పడగ" నీడలో
ఏ "కప్ప" ప్రశాంతంగా నిద్ర పోలేదని...