Facebook Twitter
రోయ్యమీసాలు....

గోకుతా...గోకుతా అని
ఎవరి వెంటా పడకు
ఎవరికి దురదపుడితే వారే
వద్దన్నా గోక్కుంటారని
మొన్న...మా తాతగారు చెప్పారు

గోచిపెడతా...గోచిపెడతా
అని ఎవరి వెంట పడకు
ఎవరి గోచి ఊడిపోతే వారే
వద్దన్నా పెట్టుకుంటారని
నిన్న...మానాన్నగారు చెప్పారు

రోషగాడైననేమి ?
రొయ్యమీసాలున్ననేమి ?
నేను మగాన్ని అన్నవాడినే
అందమైన ఏ అమ్మాయైనా
అయస్కాంతమల్లే ఆకర్షిస్తుందని
వెర్రి వెంగళప్పను కాదని
నేడు...నేను బల్లగుద్ది మరీ చెబుతున్నా

నేను వీరున్ని అన్నవాడినే
విజయ‌లక్ష్మి వరిస్తుందని...పోటీకి
భయపడి పారిపోయే పిరికిపందనుకాదని
అమ్మతోడు ఆకాశం మీద ఒట్టేసి...నేడు
నేను కుండలుబద్దలు కొట్టి మరీ చెబుతున్నా