రైతు కఠినాత్ముడా? కరుణామయుడా?
ఎర్రనిఎండలో
ఎద్దులతో రైతు
మాగాణి దున్ని
నారు పోస్తాడు
ఆకలైతే పాపం
ఆ ఎద్దులకింత
గడ్డిపెడతాడే కాని
పచ్చని నారును మాత్రం
ఎద్దుల్ని మేయనివ్వడు
ఎర్రని ఎండలో
ఎద్దులతో రైతు
దుక్కిదున్నిస్తాడు
విత్తనాలు చల్లి
పంటలు పం,డిస్తాడు
ఆకలైతే పాపం
ఆ ఎద్దులకింత
ఏ ఎండుగడ్డో ఏ పచ్చగడ్డో
వేస్తాడే కాని
పంట పొలంలో మాత్రం
ఎద్దుల్ని మేయనివ్వడు
ఎందుకంటే ఎద్దులంటే
ప్రేమలేక కాదు
పంట పండితేనే కదా
తనకు తిండి దొరికేది
తిండి తింటేనే కదా
తాను బ్రతికేది
తాను బ్రతుకితేనే కదా
తన ఎద్దులు కూడా బ్రతుకేది



