విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ
తెలుగు జాతికే గర్వకారణం అది
అన్నపూర్ణ మెడలో మెరిసే అపురూప ఆభరణం
ఔను విశాఖ ఉక్కు అంటే...
అది ఆంధ్రకే ఆణిముత్యం...అదిఆంధ్రుల ఆశాసౌధం
అట్టి ఆశల సౌధపు పునాదులు
నేడు కదిలిపోతుంటే
కళ్ళముందు నిండువిస్తరిని కాలదన్నుతుంటే
కాళ్ళకిందే లోతుగా గోతులు త్రవ్వుతూవుంటే
తిన్న ఇంటి వాసాలను
లెక్క పెడుతూ వుంటే
కల్లబొల్లి కబుర్లు చెబుతూవుంటే అందరికళ్ళకు
గంతలు కడుతూవుంటే
వింతగా చూస్తూ వుంటారా?
ఓఆంధ్రులారా!మీరు
ఆరంభశూరులేనా? అదినిజమేనా?



