Facebook Twitter
అయ్యో ! రైతన్నా! ఎంతపని చేశావన్నా !

గట్టున గడ్డిమేసే
గాడిదకేమి తెలుసు
పొలం‌ సేద్యంలో
ఎంత సంతోషం !
ఎంత సంబరం దాగివుందో !
బురదంటే ఎంత సరదో !
ఎంతసంతోషమో !
ఎంతసంబరమో ‌ !

విత్తనాలు చల్లడంలో
ఎంత వినోదమో !
పచ్చని పైరును చూస్తుంటే
ఎంత ఆనందమో పరమానందమో !
ఫలితందక్కీ పంట చేతికందితే
ఎంత ఆత్మతృప్తో !
ఎంతటి గర్వమో గౌరవమో !
ఎంతటి శాంతి సౌభాగ్యమో ! కానీ

కరువు కాటువేసిందని
అప్పులెక్కువైపోయాయని
తీర్చేదారిలేదనీ బ్రతుకేనరకమని
కనిపించని మానసిక వేదనతో
మదనపడి మదనపడి
నలిగిపోయి నలిగిపోయి
కృంగిపోయి కృంగిపోయి
కుమిలిపోయి కుమిలిపోయి
ఆత్మన్యూనతతో అర్థాంతరంగా
ఆత్మహత్య చేసుకున్న ఓ రైతన్నా !
నీవు స్వర్గానికెళ్లి ఉండొచ్చు
కానీ నీ భార్య బిడ్డలిక్కడ
నరకాన్ని అనుభవిస్తున్నారే... అయ్యే
రైతన్నా ఆవేశంలో...ఎంతపని చేశావన్నా !
నీ భార్యాబిడ్డలకు ఎవరు దిక్కన్నా చెప్పన్నా!