Facebook Twitter
వర్షమా నీకు వందనం !

వర్షం ఒక సందేశం
వర్షం ఒక అద్భుతం
వర్షం ఒక కర్తవ్యబోధ
వర్షం ఒక ప్రమాద హెచ్చరిక

వాన రాకడ ప్రాణం పోకడ
ఎవరికి తెలుసు ఈ భువిలో
ఏనాడో పంచభూతాలతో
ప్రకృతికి ప్రాణప్రతిష్ట చేసిన
ఆ దివిలోవున్న దైవానికి తప్ప

ఓ వర్షమా ! నీవొస్తే
మారిపోయేది మా
రైతన్నల తలరాతలే
రాకున్న ఉరికొయ్యలకు
వ్రేలాడేది మా అన్నదాతలే

ఓ వర్షమా ! నీవొస్తే
మాకు వసంత ఋతువే
రాకున్న గ్రీష్మ ఋతువువే

ఓ వర్షమా ! నీవొవస్తే
అది ఓ బిడ్డ జననమే
రాకున్న ఎండిన పంట
పొలాల్లో పచ్చదనం ఖననమే

ఓ వర్షమా ! నీవొస్తే
వసంత కాలానికి
వరుణుడు పూరించు
చిటపట చినుకుల శంఖారావమే
సృష్టిలోని కోట్లాది
జీవులకు అది నవజీవన రాగమే

అదిగో కరువు కోరల్లో అన్నదాతలు
ఇదిగో ఆకలి మంటల్లో నా దేశ ప్రజలు
ఓ వర్షమా !  నీకు వందనం !
మేఘమై మెరిసి ఉరుమై ఉరిమి
ఒళ్ళుమరిచి కళ్ళుతెరిచి ఒక్కసారి మాపై
నీ కరుణా కటాక్ష వీక్షిణాలను కురిపించవా !