కీచకులారా ! ఓ కిరాతకులారా !
దుష్టులారా ! ఓ దుర్మార్గులారా !
రక్తందాహం తీరని
ఓ రాక్షసులారా ! రాబందులారా !
చాటుమాటుగా కాలసర్పాలై కాటువేసే
ఓ కామాంధులారా ! కామ పిశాచులారా !
అక్కలంటూనే చెల్లెల్లంటూనే
అమ్మలంటూనే స్త్రీ జాతిని దేవతలంటూనే
కళ్ళుపొరలు కమ్మితే చిత్రహింసలకు గురిచేసి
కౄరంగా... ఘోరాతి ఘోరంగా...అతినీచంగా
ప్రేమ పేరుతో కామదాహం తీర్చుకునే
ఓ అంధుల్లారా ! కామాంధుల్లారా !
వస్తున్నాం వస్తున్నా ! త్వరలో వస్తున్నాం !
మీ కళ్ళళ్ళో త్రిశూలాలు గ్రుచ్చి మీ గుండెల్ని చీల్చి
తీరని మా రక్తదాహం తీర్చుకుంటాం !
పుడతాం పుడతాం !మళ్ళీ పుడతాం మీ భరతం పడతాం!
వస్తున్నాం వస్తున్నా ! త్వరలో వస్తున్నాం !
చూస్తాం చూస్తాం ! సహనంతో వేచి చూస్తాం !
మా శీలానికి మా సహనానికే అగ్నిపరీక్ష పెడితే
కోస్తాం కోస్తాం ! మీ పీకలు కోస్తాం !
మీ నాలుకలు కోస్తాం ! మీ ఊపిరి తీస్తాం !
వస్తున్నాం వస్తున్నా ! త్వరలో వస్తున్నాం !
వేస్తాం వేస్తాం ! గండ్రగొడ్డళ్ళతో వేటు వేస్తాం !
తీస్తాం తీస్తాం ! లోతుగా గోతులు తీస్తాం !
చేస్తాం చేస్తాం ! సామూహికంగా మిమ్మల్ని సమాధి చేస్తాం!
పుడతాం పుడతాం ! మళ్ళీ పుడతాం మీ భరతం పడతాం !
వస్తున్నాం వస్తున్నా ! త్వరలో వస్తున్నాం !
వేస్తాం వేస్తాం ! మీ నేరాలనుండి
మీ ఘోరాలనుండి మీ దుర్మార్గాలనుండి
మీ దుస్కృత్యాల నుండి మీరు బయటపడి
తప్పించుకునే అన్ని దారుల్ని మూసివేస్తాం !
వస్తున్నాం వస్తున్నా ! త్వరలో వస్తున్నాం !
మీ కలల్లో కలకత్తా కాళికలమై !
మీ కంటిలో కారమై ! మీ కాలిలో ముళ్ళులమై !
మీ పక్కలో బల్లెమై ! మీ గుండెల్లో గునపాలమై !
మహంకాళులమై ! భద్రకాళులమై ! కనకదుర్గలమై !
మీపాలిట శతృవులమై ! మీముంగిట మృత్యుదేవతలమై !
పుడతాం పుడతాం ! మళ్ళీ పుడతాం మీ భరతం పడతాం!
ఇంతకీ మేమెవరో తెలుసా? మొన్న మీ కామాగ్నిజ్వాలలకి
నిర్దాక్షిణ్యంగా బలైన ...కాలి... బూడిదైపోయిన...నిర్భయ
దిశ...ఆయేషా...ప్రత్యూషా...ప్రియాంకలకు...ప్రతిబింబాలం



