సిగ్గూలజ్జ అన్నది ఏ మాత్రం లేకుండా
నవ్వుతూ తిరిగే ఓ గుంటనక్కల్లారా !
గజ్జికుక్కల్లారా! ఓ గాడిదకొడుకుల్లారా !
కామంతో కళ్లు పొరలుకమ్మి
వావివరసలు మరచి మృగాల్లా ప్రవర్తించే
ఓ మూర్కుల్లారా ! ముష్కరులారా !
కరుణ దయ జాలి ఇసుమంతైనా లేని
ఓ అంధులారా! కామాంధులారా !
ఓ రాక్షసులారా! రాబందులారా !
మీ కన్నబిడ్డల వయసున్న
బంగారు భవిష్యత్తు ముందువున్న
కమ్మని కలలు కంటున్న అన్యంపుణ్యం ఎరుగని
అభం శుభం తెలియని అమ్మాయిల
ముందు ఎంతో మంచిగా నటించి
ఎన్నోమాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి
ఏ ముళ్ల పొదల్లోకో తీసుకెళ్లి
భయపెట్టి బాధపెట్టి చిత్రహింసలకు గురిచేసి
కామంతో రగిలిపోతూ కోర్కెలు తీర్చుకొని
అరిస్తే పీకపిసికి ఎదురు తిరిగితే
కౄరంగా కొట్టి ప్రాణాలు తీసి
చచ్చిపోతే ఈడ్చుకెళ్ళి ఏపొదల్లోనో పారేసి
లేదంటే పెట్రోలుపోసి తగులబెట్టి
రాజకీయనాయకుల అండతోనో
లంచాలు పుచ్చుకునే అధికారుల అండతోనో
దైర్యంగా తిరుగుతూ దర్జాగా బ్రతుకుతున్న
ఓ క్రూరులారా ! మీరు కుక్కలకన్నాహీనులు !
మీరు నీచులు మీరు బ్రతికిఉన్న శవాలు
మిమ్మల్ని ఉరేసి క్షణాల్లో ఊపిరితీసేకన్నా
సలసలకాగే నూనెలో వేయాలని
సూక్ష్మంగాల్లో సూదులు గుచ్చాలని
చెట్లకు కట్టేసి కాలిన సువ్వలతో వొళ్ళంతా
వాతలు పెట్టాలని కొరడాలతో కొట్టాలని
మీకు ఘోరాతి ఘోరమైన శిక్షలు విధించాలని
గరుడపురాణం ఘోషిస్తుంది గుర్తుంచుకోండి
ఓ కామాంధుల్లారా ! ఇకనైనా కరుణతో జీవించండి !
పరస్త్రీలను ఆశించకండి! పశువుల్లా ప్రవర్తించకండి !
మానవత్వాన్ని మరవకండి !
మానవమృగాలుగా మరణించకండి !
మగజాతికి మాయని మచ్చతేకండి !



