మానసిక వైద్యుల
భౌతిక శాస్త్రవేత్తల
పర్యావరణ పరిరక్షకుల
ఆర్థికశాస్త్రంలో ఆరితేరిన
ఖగోళశాస్త్రంలో కాకలు తీరిన
తర్కశాస్త్రంలో తలలు పండిన
ఆథ్యాత్మిక గురువుల అందరి
"ఆఖరి ఆకలి"...సందేశమొక్కటే !
ధైవమెక్కడో ....ధైర్యమక్కడని !
ధైర్యమెక్కడో ...దారి అక్కడని !
దారి ఎక్కడో ... ఊరు అక్కడని !
ఊరు ఎక్కడో ..అన్నదాతలక్కడని !
అన్నదాతలెక్కడో...ఎండిన పొలాలక్కడని !
ఎండిన పొలాలెక్కడో...పండని పంటలక్కడని !
పండని పంటలెక్కడో...నల్లని మబ్బులకోసం
అన్నదాతల ఎదురు చూపులక్కడని !
నల్లని మబ్బులెక్కడో...చల్లనిగాలి అక్కడని !
చల్లనిగాలి ఎక్కడో...ఉరిమే ఉరుములక్కడని !
ఉరిమే ఉరుములెక్కడో...మెరిసే మెరుపులక్కడని !
మెరిసే మెరుపులెక్కడో...కురిసే మేఘాలక్కడని !
కురిసే మేఘాలెక్కడో...చిటపట చినుకులక్కడని !
చిటపట చినుకులెక్కడో...చిరునవ్వులక్కడని !
చిరునవ్వులెక్కడో...చిరుదివ్వెలక్కడని !
చిరుదివ్వెలెక్కడో...వెన్నెల వెలుగులక్కడని !
వెన్నెల వెలుగులెక్కడో...చల్లని బ్రతులక్కడని !
అందుకే ఓ దైవమా !
మాపై దయచూపుమా !
దారిచూపుమా ! కరుణించుమా !
చిరుజల్లులు కురిపించుమా !
మా అన్నదాతల ఆశలు తీర్చుమా !
పచ్చని పంటలినిచ్చి మా అందరి
ఆకలిమంటలు తీర్చుమా ! ఓ తండ్రీ !



