మయసభ..?
తరచి చూడ...కళ్ళు తెరిచి చూడ
దూరపు కొండలు నునుపేనయా...
చెంతకెళ్ళి చూడ వింతేనయా...
రాళ్ళూరప్పలేనయా చెట్లుచేమలేనయా
పాములపుట్టలేనయా రాళ్ళగుట్టలేనయా
తరిచి చూడ...కళ్ళు తెరిచి చూడ
ఉప్పు కప్పురంబొక్క పోలికేనయా...
నాలుకకే ఎరుకయా రుచులు వేరువేరయా
తరచి చూడ...కళ్ళు తెరిచి చూడ
కాకి కోకిల రంగు ఒక్కటేనయా...
కానీ అవి రాగాలు తియ్యగా
వాటి స్వరములు వేరు వేరయా...
తరచి చూడ...కళ్ళు తెరిచి చూడ
కుక్క నక్క పోలిక ఒక్కటేనయా...
కానీ విధులు నిర్వహించమన్న
వాటి విశ్వాసాలు వేరు వేరయా....
సృష్టి అంటే ఇంతేనయా...
అంతుచిక్కని బహూ వింతేనయా...
మాయేనయా...మయ సభేనయా....



