కలియుగ దైవం
అఖిలాండకోటి బ్రహ్మాండ
నాయకుడైన శ్రీవారు
ఉత్సవ ప్రియుడు...
అలంకార ప్రియుడు...
కైంకర్య ప్రియుడే...కాదు
నైవేద్య ప్రియుడు కూడా..!
తిరుమల వైభవమంటే..?
ఎత్తైన పచ్చని ఏడు కొండలే కాదు
ఆ కొండల్లో ప్రతి ధ్వనించే
ఏడుకొండల వాడా..! వెకటరమణా..!
గోవిందా..! గోవిందా..! అంటూ
భక్తకోటి ముక్తకంఠంతో భక్తి
పారవశ్యంతో చేసే ఆర్తనాదాలే కాదు
310 ఏళ్లు నిండిన
దేశ విదేశాల్లో భక్తులకు
అమృత పదార్ధంగా...
భక్తిరస మాధుర్యాన్ని పంచే...
తిరుమల శ్రీవారికి అతి ప్రీతిపాత్రమైన
అతి రుచికరమైన సువాసనలు వెదజల్లే భక్తుల నోరూరించే ఘుమ ఘుమలాడే
పరమ పవిత్రమైన...ప్రసాదం...కూడా
అట్టి "ప్రసాదాన్ని" రాజకీయం చేసిన
ఓ నయవంచకులైన నాయకుల్లారా..!
గర్భగుడిలో శ్రీనివాసుడున్నాడు...అన్నీ
గమనిస్తున్నాడు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త
"ఆ మహాపచారానికి"
"అబద్ధపు ప్రచారానికి"
"ఒడిగట్టిన ఓ ప్రజానాయకుల్లారా..!
"భవిష్యత్తులో మీకు"గుండు" కొట్టించి... "తిరువీధుల్లో "ఊరేగించే...ఆ శ్రీహరి
"విధించే "శిక్షకు" మీరు సిద్దం కండి..!



