ఎవరు గొప్ప..?
శిల్పులా..?
చిత్రాకారులా..?
ఎవరు గొప్ప..?
సరస్వతీ పుత్రులా..?
సంగీత సామ్రాట్ లా..?
ఎవరు గొప్ప..?
గాయనీ గాయకులా..?
వెండితెరపై వెలుగే నటీనటులా..?
ఎవరు గొప్ప..?
దివ్య దృష్టిగల దర్శకేంద్రులా..?
కోట్లుకోట్లు
కర్పూరంలా ఖర్చుచేసే నిర్మాతలా..?
ఎవరు గొప్ప..?
జన్మనిచ్చిన అమ్మానాన్నలా..?
జ్ఞాన బోధ చేసిన గురుదేవుళ్ళా..?
ఎవరూ కాదు
వీరికి ప్రాణం పోసి
ఈ పాత్రధారులను సృష్టించిన
"సూత్రధారియైన ఆ సృష్టికర్తే" గొప్ప ..?



