Facebook Twitter
ఓం ఓం సిద్దివినాయక నమో నమోః

శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం
ఏకదంత ముపాస్మహే...
ఏకదంత ముపాస్మహే...
అంటూ శ్లోకాలనను పఠిస్తూ...
భక్తి గీతాలను ఆలపిస్తూ...

బుద్ధిని...సిద్దిని...వృద్దిని...
సంపూర్ణ ఆరోగ్యాన్ని...
అష్టైశ్వర్యాలను...
దీర్ఘాయుష్షును...
తెలివి తేటల్ని...
సుఖశాంతులను...
చెరగని చిరునవ్వులను...
తరగని సిరిసంపదలనందించమని...
కోరుకుందాం..! కోరుకుందాం..!
భక్తితో బొజ్జ గణపయ్యను
వేడుకుందాం..! వేడుకుందాం..!
ఓం ఓం విశ్వవినాయక నమో నమోః..!

ఆనందం బొజ్జంత...
సమస్యలు ఎలుకంత...
ఆయుష్షు తొండమంత...
జీవితాలు చేతిలో లడ్డంత
రుచిగా తియ్యగా...ఉండాలని...
బొజ్జ గణపయ్యకు
లడ్లు కుడుములు తినిపిద్దాం...!
జలప్రళయాలనుండి...
విధ్వంసకర విపత్తులనుండి...
తన భక్తులను తక్షణమే రక్షించమని
కోరుకుందాం..! కోరుకుందాం..!
భక్తితో బొజ్జ గణపయ్యను
వేడుకుందాం..! వేడుకుందాం..!
ఓం ఓం సిద్ది వినాయక నమో నమోః..!

కన్నీళ్ళనూ నవ్వులుగా...
కష్టాల కారుమబ్బులను...
అందాల ఆనందాల
హరివిల్లులుగా మార్చమని...
తలపెట్టిన ప్రతి శుభకార్యంలో
విఘ్నాలను తొలిగించమని... సకలశుభాలను...ఊహించని... ఘనవిజయాలను అందించమని...
కోరుకుందాం..! కోరుకుందాం..!
భక్తితో బొజ్జ గణపయ్యను
వేడుకుందాం..! వేడుకుందాం..!
ఓం ఓం పార్వతీ నందన నమో నమోః..!