ఓం గణపతి బప్పా మోరియా..!
వక్రతుండ మహాకాయ...
సూర్యకోటి సమప్రభ...
నిర్విఘ్నం కురుమేదేవ...
సర్వకార్యేషు సర్వదా...
శుక్లాంబరధరం విష్ణుం...
శశివర్ణం చతుర్భుజం...
ప్రసన్న వదనం ధ్యాయేత్...
సర్వ విఘ్నోప శాంతయే...
అగజానన పద్మార్కం...
గజానన మహర్నిశం...
అనేకదంతం భక్తానాం...
ఏకదంత ముపాస్మహే...
ఏకదంత ముపాస్మహే...
అంటూ శ్లోకాలనను పఠిస్తూ...
భక్తి గీతాలను ఆలపిస్తూ...
బొజ్జ గణపయ్యకు
లడ్లు కుడుములు తినిపిద్దాం...!
జలప్రళయాలనుండి...
విధ్వంసకర విపత్తులనుండి...
తన భక్తులను తక్షణమే రక్షించమని
కోరుకుందాం..! కోరుకుందాం..!
భక్తితో బొజ్జ గణపయ్యను
వేడుకుందాం..! వేడుకుందాం..!
ఓం ఓం సిద్ది వినాయక నమో నమోః
ఓం ఓం గణ గణపతయే నమో నమః
ఓం ఓం అష్ట వినాయక నమో నమః
ఓం గణపతి బప్పా మోరియా నమోనమః



