కాపాడగ రావయ్యా ఓ కరుణామయ..!
విఘ్నాలను తొలగించి
ఘన విజయాలనందించే
ఓ విఘ్నేశ్వరా...నమో నమః...!
సుబుద్దిని అభివృద్ధిని
చిత్తశుద్దిని వరాలుగా కుమ్మరించే
ఓ సిద్ది వినాయక...నమో నమః...!
జలప్రళయాలనుండి...
విధ్వంసకర విపత్తులనుండి...
విషాదకర విషఘడియలనుండి...
విముక్తి కలిగించి భక్తుల బాధల్నితీర్చే
సకల శాపాలను పాపాలను హరించే
ఓ పార్వతీ తనయ...నమో నమః...!
మా మదపుటేనుగు వంటి సమస్యను
మీ వాహనమైన మూషికంగా మార్చి...
రక్షించ రావయ్యా ఓ బొజ్జ గణపయ్య..!
కాపాడగ రావయ్యా ఓ కరుణామయ...!



