ఆంగ్ల కవి
విలియం
షేక్స్పియర్
ఏనాడో చెప్పారు
ఒక "కుక్క
"మనిషిని" కరిచిందంటే..?
అదొక "బ్రేకింగ్" న్యూస్ అని...
ఒక "మనిషి కుక్కను" కరిచాడంటే..?
అదొక "షాకింగ్" న్యూస్ అని...
దేవుడున్నాడా లేడా..? అంటే
భక్తులంటారు
భగవంతుడున్నాడని...ఆ
పరమాత్మ సర్వాంతర్యామియని...
హేతువాదులంటారు
ఎక్కడున్నాడో చూపించమని..?
పిలిస్తే పలకని రాతిబొమ్మలకే
సర్వం సమర్పయామియని...
కానీ...కాలం మారి
కుక్క నక్కైతే...
కోడి కొంగైతే...
భక్తులే దేవుడు లేడంటే...?
అదొక "బ్రేకింగ్" న్యూస్
దేవుడు లేడు లేడని వాదించే
హేతువాదులే దేవుడున్నాడంటే..
అదొక "షాకింగ్" న్యూస్
అప్పుడాకాశ వీధిలో
అద్భుతాలెన్నో జరగవచ్చును
నక్షత్రాలు నవ్వవచ్చును
గాలి ఈలలు వేయవచ్చును
సముద్రాలు ఎండిపోవచ్చును
ఏదైనా జరగవచ్చును
ఏమైనా జరగవచ్చును...
ఏనుగులు ఎవరెస్ట్
శిఖరం ఎక్కవచ్చును
ఎండమావుల్లో
ఏరులు ప్రవహించవచ్చును...
ఏదైనా జరగవచ్చును
ఏమైనా జరగవచ్చును
ఉరుము ఉరమవచ్చును
మెరుపులు మెరవవచ్చును
కుంభవర్షాలు కురవవచ్చును
"యాగి" తుఫానులు రావొచ్చును
వచ్చి విధ్వంసం సృష్టించవచ్చును
మృత్యువు తాండవమాడవచ్చును
భూమి"మరుభూమిగా" మారవచ్చును
భీకరమైన హోరుగాలులకు నరులంతా
చిగురుటాకుల్లా విలవిలలాడవచ్చును
ఏదైనా జరగవచ్చును...
ఏమైనా జరగవచ్చును...
నేలపై పడే పిడుగులు
నెత్తిన గొడుగులుగా మారవచ్చును
సూర్యచంద్రులు కనిపించక పోవచ్చును



