ఎందుకో ఏమో అర్థం కాకున్నది..!
నిన్న
శిథిలావస్థలో
పడిఉన్న
శిలనుండి
శిల్పి చెక్కిన
సుందర శిల్పం శివుడు..?
గర్భగుడికి
చేరగానే నేడుపూజలు
పునఃస్కారాలు
అర్చనలు అభిషేకాలు
భక్తులు ఆ శంకరుని
పాదాలకు మ్రొక్కుతారు
పాలాభిషేకం చేస్తారు
కానీ ఆకలికి అలమటించే ఆ
శిల్పిని ఆదుకునే నాధుడెవరు..?
గుడి
ముందర
బారులు
తీరిన బిక్ష గాళ్ళు
గుడిమెట్లు
ఎక్కీదిగే భక్తులనే
వేడుకుంటారు
ప్రాధేయపడతారు
కాళ్ళకు మ్రొక్కుతారు
కొంచెం ధర్మం చేయమని
కానీ గుడిలోని
దైవానికిశ గారుమ్రొక్కరు...
అర్థించరు...ప్రార్థించరు
తమ కాలే కడుపుల్ని నింపమని...
తమ దారిద్ర్యాన్ని తొలిగించమని...
తమ బ్రతుకుల్ని బాగు చేయమని...
ఎందుకో ఏమో...ఎంతకూ అర్థంకాకున్నది



