నేను
దేవుణ్ణి
చూడలేదని...
చెప్పకండి మన చుట్టూ
శత్రువులు మిత్రులున్నట్లే
అదృశ్యంగా అకస్మాత్తుగా
ఆదుకునే దేవుళ్ళుంటారు
భయపెట్టే భూతాలుంటాయి
కష్టకాలంలో మనకు
సహాయం అందించిన
ఆప్యాయతతో ఆపదలో
ఆదుకున్న ప్రతి ఒక్కరూ
ఆపధ్భాంధవులే...
అనాధ రక్షకులే...
దేవునికి ప్రతిరూపాలే...
దేవుడు పంపిన దైవదూతలే...
కారణం ప్రత్యక్షంగా
ఎందరో తమ కళ్ళతో
మన కష్టాలను చూసినా
విన్నా స్పందించరు
సహాయమందించరు
కంట కన్నీటిని తుడవరు
సహాయం చేయశక్తి ఉన్నా
పలకరించరు పట్టించుకోరు
కానీ దేవునిచే ప్రేరేపితమైన
ఒకే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ
మీ దగ్గరికొస్తాడు సహాయం చేస్తాడు
అది ఆ దేవున్ని ఆజ్ఞ...
ఎందరో ఉన్నా ప్రత్యేకంగా
ఎన్నుకోబడిన ఆ మానవతావాది
ఆ భగవంతుని ఆజ్ఞానుసారం
తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తాడు
అతడే మనకు ప్రత్యక్ష దైవం
అందుకు మనం కృతజ్ఞులమై
చేసిన మేలును మరిచిపోరాదు
ఆ వ్యక్తిని తప్పక గుర్తుంచుకోవాలి
దివినుండి దేవుడే దిగి వచ్చాడని
దైవదర్శనమైందని కృతజ్ఞతతో
గుండెలో అతడికి గుడి కట్టాలి...
నిత్యం స్మరించుకుంటూ ఉండాలి...



