మూగ గొంతులతో కాదు...
మువ్వన్నెలజెండా చేబూని
అహింసామూర్తి
జాతినేత జాతిపిత మన
బాపూజీ సారధ్యంలో
వందేమాతర మంటూ
క్విట్ ఇండియా అంటూ
దిక్కులు పిక్కటిల్లేలా
నినదించిన నిప్పులు
కురిపించిన గళాలతో వచ్చిందే...
ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం..!
పిరికి పిడికిళ్లతో కాదు...
బిగించిన ఉక్కు పిడికిళ్ళతో
మృత్యువును ముద్దాడేందుకు
సిద్ధమైన విప్లవ వీర కిషోరాలతో
స్వాతంత్ర్య సమర యోధులతో
ఎందరో జాతినేతల
ప్రాణత్యాగాలతో వచ్చిందే...
ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం...!
పిరికి పందలతో కాదు...
ఎందరో విప్లవవీరులు
గర్జించే కొదమసింహాలై
గండ్రగొడ్డళ్ళు చేపడితేనే...
అదరక బెదరక ఎదురిస్తేనే...
తెల్లవారి గుండేల్లో నిదురిస్తేనే...
తెల్లదొరల తలలు తెగనరికితేనే...
వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం..!
స్వార్థపరులతో కాదు...
బానిసత్వంలో బంధించి
మానవ హక్కులను కాలరాసే
చిత్ర హింసలకు గురిచేసే
తెల్ల కుక్కల భరతంపట్టిన
భయమన్నది ఎరుగని
మన భరతమాత ముద్దుబిడ్డలు
భగభగమండే భాస్కరులై
ఖణఖణమండే నిప్పుకణికలైన
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లు
అతిపిన్న వయసులో అసువులుబాస్తేనే
వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం..!
నేడు 78 వ స్వాతంత్ర్య దినోత్సవం
భారతీయులందరికీ విముక్తి పండగ
స్వాతంత్ర్యం అంటే
సమానత్వం సౌభ్రాతృత్వం
స్వేచ్ఛా వాయువులను పీల్చడం
స్వాతంత్ర్యం అంటే ప్రజాస్వామ్యం
ఆ ప్రజాస్వామ్యంలోనే దక్కు...
ప్రాధమిక హక్కులు రాజ్యాంగ రక్షణ...



