Facebook Twitter
ఎగురవేద్దాం ! ‌ఎగురవేద్దాం ! ఇంటింటా ! మువ్వన్నెల జెండా !

స్మరించుకుందాం !
స్మరించుకుందాం !
వందేమాతరం...
జనగణమన...సృష్టికర్తలైన
ఆ బంకించంద్ర చటర్జీ...
రవీంద్రనాథ్ ఠాగూర్ లను...
జాతీయ పతాక రూపశిల్పి
శ్రీ పింగళి వెంకయ్యను...

తెలుపుదాం !
తెలుపుదాం !
విప్లవాభివందనాలు...
దేశరక్షణకోసం
ప్రాణాలను త్యాగంచేసి
తల్లిభరతమాత నుదుట
రక్తతిలకాన్ని దిద్దిన
విప్లవవీరులైన
ఆ భగత్ సింగ్...అల్లూరి...
ఝాన్సీలక్ష్మీబాయిలకు...

గుర్తుచేసుకుందాం !
గుర్తుచేసుకుందాం !
భారతమాత
దాస్యశృంఖలాలను త్రెంచ
ఆంగ్లేయుల అకృత్యాల
నెదిరించి జైళ్ళలో మ్రగ్గిన
స్వాతంత్ర్య సమరయోధులు...
దేశభక్తులు జాతినేతలైన...

ఆ గాంధీజీ...
నెహ్రూ...నేతాజీ...
సర్దార్ వల్లభాయ్ పటేల్...
అటల్ బిహారీ వాజపేయి...
ఇందిర...అబ్దుల్ కలాంలను...
రక్షణ కవచం వంటి
రాజ్యాంగ రూపశిల్పి...
అపర మేధావి...
అమరజీవి అంబేద్కర్ ను...

చేద్దాం! చేద్దాం ! అందరం
నేడే భగవద్గీతపై ప్రమాణం...
"బంగరుతల్లి భరతమాత" పాదారవిందాలకు మ్రొక్కి...
దేశ‌రక్షణే...
మా ఆశయమని...
దేశ సమగ్రతే...
మా ఆఖరి లక్ష్యమని...
ఏ సమరానికైనా...
ఏ ప్రాణార్పణకైనా...
సదా మేం సంసిద్ధమని...