Facebook Twitter
అమ్మాయిలు....కొందరు?

తామనుకున్నది

సాధించేవరకు నిద్రపోరు

ఎవ్వరికీ భయపడరు

ఎవ్వరినీ లెక్కచెయ్యరు

వెనుతిరుగరు వెనుకంజ వెయ్యరు

కలనిజమయ్యేవరకు కన్నుముయ్యరు

ఒంటరిగానైనా చేస్తారు "ప్రేమపోరాటం"

 

అది అజ్ఞానమో....అవివేకమో...

అహంకారమో......అమాయకత్వమో

మొండితనమో ....అసలర్థమే కాదు

 

ముఖపరిచయంలేని మూర్కుడైనా

మోసగాడైనా దుష్టుడైనా‌ దుర్మార్గుడైనా

నీచుడైనా నికృష్టుడైనా చావుదెబ్బలకైనా

రంపపు కోతలకైనా రక్తతర్పణకైనా

ప్రియుడికోసం ప్రాణత్యాగానికైనా కడకు

కన్నవారిని "కడతేర్చడానికైనా" సిద్దమే

 

అది అనుకున్నది 

సాధించాలన్న పట్టుదల కావచ్చు

కోరుకున్నది

సొంతం కావాలన్న కోరిక కావచ్చు

ప్రేమపిచ్చి కావచ్చు

కళ్ళు పొరలు కమ్మిన కామం కావచ్చు

ఏదైనా కావచ్చు కానీ సత్యం

ఎవరికి ఎరుక ? ఆ పరమాత్మకు తప్ప