తుదిశ్వాస...వరకు
ఓ మనిషీ
వీధిలోకి నిశీధిలోకీ
నిరాశతో తొంగిచూడకు
స్వార్థాన్ని
పడగవిప్పి
బుసలు కొట్టనివ్వకు
నిస్వార్థాన్ని
నీడలో నడవనివ్వకు
నీటిలో నిద్రపోనివ్వకు
త్యాగం
బాణంలా
వెలుగు కిరణంలా
పరుగులు పెట్టనియ్
కసిగా
కాంతికన్నా
వేగంగా వెళ్ళే దేనిని
ఆపకు దేనికి అడ్డురాకు
అసత్యం
సత్యమైన వేళ
చిమ్మచీకటి
వెన్నెల వెలుగౌతుంది...
అది నిప్పులా
మండే ఒకనిజమే
అందుకే వ్యధచెందకు
తుదిశ్వాస వదిలేవరకు...



