ప్రకృతి నియమం..! సృష్టికర్త శాసనం!!
చేజారిన..."ఈ క్షణం"
తిరిగి మళ్ళీ మనకు
చేరేది లేదు లేనేలేదు..!
గిర్రున తిరిగి ముందుకెళ్ళిన
"కాలచక్రం"... ఇక మళ్లీ
వెనక్కి తిరిగి రాదు రానేరాదు..!
నేలలో ఒలికి దుమ్ములో ధూళిలో
ఏకమైపోయిన..."తేనెను"... మళ్ళీ
ఎవరూ తీసుకు రాలేరు రానేలేరు
పొయ్యి మీది పాత్రలో నుండి
పొంగి పొయ్యిలో పడిపోయిన
"పాలు" ఇక పొయ్యి పాలే...ఎవరూ
ఎత్తి పాత్రలో పోయలేరు పోయనేలేరు
ఈ భూమి పై కన్ను తెరిచి
కొంతకాలం జీవించి ఆపై ఆ
పరమాత్మనుండి పిలుపొచ్చి
కన్ను మూసిన కాటికెళ్ళిన
ఏ "జీవీ " ఇక కళ్ళుతెరిచేది లేదు
కళ్ళకు కనిపించేది లేదు ఈ లోకంలో...
ఇది తరతరాలుగా మార్పులేని...రాని...
ఆ ప్రకృతి నియమం సృష్టికర్త శాసనం...



