కన్నీటి ప్రార్థన..
ఓ దైవమా
నోళ్ళు తెరచి
కోరలు చాచి
బుసలు కొడుతూ
కసిగా కాటు వేయడానికి
సిద్ధమైన సైతాను స్నేహితులైన
సకల సమస్యల విషసర్పాల
బారినుండి తప్పించండి తండ్రి..!
నష్టాల నదులను దాటి
కష్టాల కడలిని ఈది
సుఖాల శిఖరాలను చేరి
పరువు ప్రతిష్టల
పర్వతాలను...ఎక్కేలాగున...
జీవితమంతా అంతులేని
ప్రశాంతత...దక్కేలాగున...
నీ కరుణా కటాక్ష వీక్షణాలను
కుంభవర్షంలా మాపై కురిపించి
మమ్ము చల్లగా చూడండి తండ్రి..!
ఇదే మా చిరు అభ్యర్థన...
మీకు సాష్టాంగ నమస్కారం
చేస్తూ...చేసే కన్నీటి ప్రార్థన...



