ఈ మహా విషాదానికి అందరూ కారకులే...?
ఔను తరచి
తరచి చూస్తే
మొదటి తప్పు
అమాయకపు ప్రజలదే...
అవగాహన కలిగించని
మేధావులేదే...
ప్రవచన కర్తలదే...
వారిని చైతన్యపరచని
మహిళా సంఘాలదే...
లాభాపేక్షతో పనిచేసే
లంచగొండి అధికారులదే...
అనుమతులిచ్చే ప్రభుత్వ పాలకులదే...
ఇట్టి మోసపూరిత భారీ కార్యక్రమాలపై నిఘా పెట్టని...భారీసంఖ్యలో తరలివచ్చే
ప్రజలను నియంత్రించని భద్రతాసిబ్బందిదే



