ఎవరో తింటే మన
ఆకలి తీరుతుందా..?
ఎవరో స్నానం చేస్తే
మన మురికిపోతుందా..?
కష్టపడితేనే కదా
కడుపు నిండేది
డాక్టర్లను సంప్రదిస్తేనే
కదా రోగాలు తగ్గేది...?
మందులేసుకుంటేనేకదా
మొండివ్యాధులు
నయమయ్యేది..?
తాము
దైవస్వరూపులమని...
మాయమాటలతో
ప్రజలను మభ్యపెట్టే...
తమకు మానవాతీత
శక్తులున్నాయని భ్రమపెట్టే
ఈ దొంగ బాబాలను
ఎందుకు నమ్ముతారో
ఈ పిచ్చి ఈ వెర్రి
ఈ అమాయకపు
ఈ అజ్ఞానపు జనం...
ఎప్పుడంతమయ్యేను.
ఈ మూఢాచారాలు...?
ఈ మూఢనమ్మకాలు...?
ఎప్పుడు ఈ అమాయకపు
భక్తులకు జ్ఞానోదయమయ్యేను..?
ఎప్పుడు వీరికి కనువిప్పు కలిగేను..? ఎప్పుడు వీరిలో చైతన్యం రగిలేను..?
ఎప్పుడు అజ్ఞానాంధకారం తొలిగేను..?
ఎప్పుడు ఈ చీకటి జీవితాలు వెలిగేను..?
భక్తి ముసుగులో అక్రమాలకు పాల్పడే
ఈ దొంగ బాబాల భరతం పట్టేదెవరు..?
ఈ ఘోర విషాదానికి బాధ్యులెవరు....?
కాదిది మట్టి వ్రాసిన మరణశాసనం...ఇది
బాబా సృష్టించిన దారుణ మారణహోమం



