Facebook Twitter
చిరు ప్రార్థన...

దయగల ఓ దైవమా..!
దారిచూపే ఓ దీపమా..!
ప్రేమకు ప్రతిరూపమా..!

మాకు భోగభాగ్యాలు వద్దు
కష్టాలు కలతలు కన్నీళ్లు
చింతలు చీకాకులులేని...
రోగాలురాని...రోజులను
దయచేయండి చాలు..!

మాకు కోట్లకోట్ల
ఆస్తిపాస్తులు వద్దు
మా చిరుకోరికలు
తీర్చండి...ఈ ఐదు
వరాలివ్వండి చాలు..!

సద్బుద్ధితో
సత్సంకల్పంతో
సక్రమమైన మార్గంలో
...ఆర్జించే ఆదాయం...

పుష్టికరమైన ఆహారంతో
...ఆనందం పరమానందం...

సుఖశాంతులతో
...సంపూర్ణమైన ఆరోగ్యం...

పదిమందిని ప్రేమించే
సేవించే హృదయంతో
...ప్రశాంతమైన జీవితం...

నీతి నిజాయితీతో
...నిండూ నూరేళ్ల ఆయుష్షు