Facebook Twitter
మూఢభక్తితో మృత్యుకుహరంలోకి..

అయ్యో ఓ దైవమా..! ఇదేమి ఘోరం..?
ఇదెంతటి దారుణం..? ఎవరిదీ నేరం..?

మతం మత్తెక్కి...
తొక్కిసలాటలో చిక్కి...
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై భోలేబాబా
కాలిమట్టిలో మహిమలున్నాయని
నమ్మి 120 మంది అమాయకపు మహిళలు మట్టిలో కలిసిపోయారే..!
మూఢాచారాలకు...
మూఢనమ్మకాలకు బలైపోయారే....!

ఆస్పత్రి ఆవరణలో ఎటు చూసినా
గుట్టలు గుట్టలుగా మృతదేహాలే...
భక్తుల హాహాకారాలే...
బంధువుల ఆర్తనాధాలే...
ఆథ్యాత్మిక కార్యక్రమంలో
అమాయకపు భక్తులెందరో
అసువులు బాశారే...
సత్సంగ్ కార్యక్రమానికి వెళ్ళి
సమాధి అయ్యారే...
అయ్యో ఓ దైవమా..! ఇదేమి ఘోరం..?
ఇదెంతటి దారుణం..? ఎవరిదీ నేరం..?

దేవుడని భ్రమపడిన భక్తుల పాలిట
భోలే బాబే ఒక యముడయ్యాడే...
భక్తులనెందరినో బలితీసుకున్నాడే...

ఎన్నో ఆయుధాలు ధరించి ఉన్న
ముక్కోటి దేవతల్లో ఒక్కరు కూడా
అకాలమృత్యువునాపలేకపోయారే..?
అయ్యో ఓ దైవమా..! ఇదేమి ఘోరం..?
ఇదెంతటి దారుణం..? ఎవరిదీ నేరం..?
భక్తులను నమ్మించిన భోలే బాబాదా..?
భద్రత కల్పించలేని నిర్వాహకులదా..?
అనుమతిచ్చిన ప్రభుత్వ అధికారులదా..?

తక్షణమే ఆ భోలే బాబా
బండారం బయట పెట్టాలి..!
కఠినమైన చర్యలు
తీసుకోవాలి...కటకటాల్లోకి నెట్టాలి..!

ఆ భోలేబాబా ఆస్తుల్ని జప్తు చేసి మృతులకుటుంబాలకు పరిహారమివ్వాలి
ప్రభుత్వం తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స వైద్యం అందజేయాలి..!
ఇట్టి దుర్ఘటనలు పునరావృతం కాకుండా
ప్రజలే ఈ దొంగబాబాల భరతం పట్టాలి..!