వెలిగించని
ఏ కొవ్వొత్తి కరిగిపోదు
కానీ...
వాడినా
వాడకున్నా
ప్రతి వాహనం
తుప్పుపట్టి పోతుంది...
ఎందుకో ఏమో...
ఎవరికెరుక..? ఆ పరమాత్మకు తప్ప
కాలచక్రం క్రింది పడి
నలిగి పోయిన ఏ సంవత్సరం
తిరిగి మళ్లీ మన కళ్ళకు కనిపించదు
కానీ...
పండిన
చెట్టు నుండి నేలరాలిన
కాయ నుండి...ఒక విత్తనం
ఆ విత్తనం నుండి...ఒక మొక్క
ఆ మొక్క నుండి...
ఒక మహావృక్షం మళ్ళీ ఉద్భవిస్తుంది
ఎందుకో ఏమో...
ఎవరికెరుక..? ఆ పరమాత్మకు తప్ప
ఏ పూర్వజన్మ
పుణ్యఫలమో
ఏ దేవివరమో...
ఈ భూమిపై జన్మించిన
నరులంతా కన్నుమూసి కాటికెళ్తారు
ఆపై ఇకవారు ఎవరి కంటికీ కనిపించరు
కానీ...
మేఘాలనుండి నేలరాలిన
వానచినుకులు కొన్ని భూగర్భంలోకి...
కొన్ని బావులు చెరువులు నదుల్లోకి...
కొన్ని నదుల నుండి సముద్రంలోకి...
ఆ సముద్రంలో ఆవిరై తిరిగి
మళ్ళీ ఆ తల్లిమేఘాలను చేరుతాయి
ఎందుకో ఏమో...
ఎవరికెరుక...? ఆ పరమాత్మకు తప్ప
కాబోలిది ప్రకృతి ధర్మం...ఆ సృష్టి మర్మం



