Facebook Twitter
అందాలు ఆరబోసే అప్సరసలెందరో...

ఒంపుసొంపులతో ఓరచూపులతో
కొంగుచాటున దాచినఅందాలన్నీ ఆరబోసే
అందమైన అప్సరసలెందరో...
పిటపిటలాడే పాలపిట్టలెన్నో...
కోర చూపుల కొరడాలతో కొట్టి
కోరిన కోర్కెలన్నీ తీర్చే కోడిపెట్టలెన్నో...

సినిమాల్లో ఛాన్స్ లకోసం వెండితెర మీద వెలగాలని
మిణుకుమిణుకుమంటూ తళుక్కున
మెరిసే తిరుగుబోతు తారలెన్నో...

విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయాలని
తపించే...తనువులోని అణువణువులోని
అందాలను విరజిమ్మి కుర్రకారును వెర్రెత్తించే
ఆశబోతు అతిలోక సుందరీమణులెందరో...

కాసులరేసులో అందచందాలనే పెట్టుబడిగా పెట్టి
అంగాంగప్రదర్శనతో కేకపుట్టించి యువతలో
తీరని ఆశలను ఆరని ఆకలిని రేపి
చురుకైన చూపులతో గుచ్చిగుచ్చి చంపే ఆ
రతీమన్మథులకే మతిపోగొట్టే
రంభాఊర్వశులెందరో...
రంగురంగుల రామచిలకలెన్నో...

దర్శక నిర్మాతల మెప్పుకోసం చీకటి ఒప్పందాలక ఒకే
చెప్పే మాయదారి జిత్తులమారి చక్కనైన ‌చుక్కలెందరో...
మురిపించే వగలమారి‌ ముద్దుగుమ్మలెందరో ...
బరితెగించే ఒంపుసొంపుల ఒయ్యారి భామలెందరో...

అవకాశాలు అందని ద్రాక్ష కాగా అందరిదృష్టిలో
పడాలని ఆకర్షించాలని పిచ్చిపిచ్చిగా రెచ్చిపోతూ
సెన్సేషనల్ మరియు వైరల్ న్యూస్ తో సోషియల్ మీడియాలో హల్ చల్ చేసి
అదృష్టాన్ని పరీక్షించుకునే
అందమైన సుందరాంగులెందరో...

మాయలో దించే మత్తులోముంచే
చిత్రవిచిత్రమైన ఆ చీకటి వెలుగుల సినీ చిత్రజగత్తులో...
ఆ వెండితెరమోజులో...
ఎందరో ఎందరెందరో ఆశల ఆరాటంలో ఆకలి పోరాటంలో...
కోర్కెల కొలిమిలో....